ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర

 బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ముగిసింది. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు, 211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు యాత్ర కొనసాగింది.  యాత్ర చివరి రోజున బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో పలు అభివృద్ది పనులకు బండి సంజయ్ శంకుస్థాపన  చేశారు.  ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమాయానికి ప్రజాహిత యాత్రను ముగించారు సంజయ్. 

 2024 ఫిబ్రవరి 10వ తేదీన  కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశారో వివరించేందుకే ఈ యాత్రను బండి సంజయ్ చేపట్టారు. కాగా ప్రస్తుతం కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సంజయ్ ఉన్నారు.