దేశంలో మోదీ హవా కొనసాగుతోంది: బండి సంజయ్

కాంగ్రెస్..బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. బీజేపీ చేసిన తప్పులు బయటకు రాకుండా ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తోందన్నారు. రెండు పార్టీల డైవర్ట్ పొలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై.. BRS నేతలు అహంకారంతో మాట్లాడుతూ చెప్పు చూపించడమేంటని మండిపడ్డారు.

 కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 10న మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలో మోదీ హవా కొనసాగుతోంది..సర్వే నివేదికలు BJPకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజగవర్గం రంగాపూర్ లో పర్యటించి బస చేశారు బండి సంజయ్.