- తొలివిడతలో రాజన్న జిల్లాలో ఎంపీ సంజయ్ పాదయాత్ర
కరీంనగర్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ నెల 10 నుంచి మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా, లోక్ సభ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర చేపట్టనున్నారు. 10న తొలివిడతలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుంచి వేములవాడ
సిరిసిల్ల నియోజకవర్గాల్లో 119 కి.మీ మేర ఈ యాత్ర సాగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ముగింపు సభను నిర్వహించనున్నారు. యాత్ర ఏర్పాట్లపై బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి
ప్రతాప రామకృష్ణతోపాటు పార్లమెంట్ ప్రభారీలు మీసాల చంద్రయ్య, కన్వీనర్ ప్రవీణ్ రావు సహా ఆయా జిల్లాల నుంచి యాత్రకు సంబంధించి వివిధ విభాగాల బాధ్యులు హాజరయ్యారు.