అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తా

నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా తమ గ్రామాన్ని చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మండలంలో కలిసేలా చూడాలని గుండ్రాంపల్లి గ్రామస్తులు సంజయ్‌‌‌‌‌‌‌‌ని కోరారు. ఫార్మా కంపెనీల కారణంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, కంపెనీల కోసం తమ భూములు లాక్కుంటున్నారని వెలిమినేడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సుంకెనపల్లికి చేరుకున్న బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారు. వడ్రంగి, గీత కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సుంకెనపల్లి వద్ద బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ని కలిసిన దాసోజు శ్రవణ్‌‌‌‌‌‌‌‌ సూరారం రోడ్డు వరకు ఆయన వెంట నడిచారు. అక్కడి నుంచి రామన్నపేట మండలం వెల్లంకి వెళ్తూ మార్గమధ్యలో పత్తి చేనులో పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు. తమకు ఇండ్లు ఇవ్వలేదని, అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలప్పుడు వచ్చిన లీడర్లు తర్వాత తమ ముఖం కూడా చూడడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకైనా పేదల సమస్యలు తీర్చాలని కోరారు. దీంతో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని, బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆచార్య కూరెళ్ల లైబ్రరీని సందర్శించారు. విఠలాచార్య ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బంగారు శృతి, యాత్ర ప్రముఖ్‌‌‌‌‌‌‌‌ గంగిడి మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.