గంగుల వెనుక ఎంఐఎం ఉంది.. బీజేపీని అధికారంలోకి తేవడమే నా లక్ష్యం

కేసీఆర్ మూర్ఖపు  పాలన విరగడైనందుకు సంతోషమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియం సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలకు అభినందనలు తెలిపారు. గంగుల వెనుక ఎంఐఎం ఉందని.. ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకే ముస్లింలు ఓట్లేస్తారా? అని ప్రశ్నించారు. హిందూ సమాజమంతా ఆలోచించాలని.. తనను ఓడగొట్టేదాకా మా పార్టీ వాళ్లే వెంటపడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.

ఓడినా.. గెలిచినా ప్రజల్లోనే ఉంటానన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని.. కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నానని బండి సంజయ్ అన్నారు. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బండి సంజయ్ ఓడిపోయారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. 3,284 ఓట్ట మెజార్టీతో బండి సంజయ్ పై విజయం సాధించారు.