
జూన్ 4న కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయని అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. హిందువులంతా ఏకమైతే ఫలితాలెలా ఉంటాయో కరీంనగర్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఆరోజున బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డాక్టర్లను పక్కనపెట్టుకుంటే బెటర్ అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారన్న సంజయ్.. ప్రభుత్వం ఇకనైనా హామీలపైన అమలుపై దృష్టి సారించాలన్నారు. ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని.. ఇచ్చిన హామీల అమలుకు విధివిధానాలు రూపొందించాలని చెప్పారు బండి సంజయ్. లేనిపక్షంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కరీంనగర్ లోక్ సభ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకున్న మహాశయులందరికీ ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్