లిక్కర్ దందాలో ఎమ్మెల్సీ కవిత వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని నందన్ తండాలో జరిగిన రచ్చబండలో మాట్లాడిన బండి సంజయ్.. ఫాంహౌజ్ లో వ్యవసాయం చేసే కేసీఆర్ కోటిశ్వరుడైతే... అన్నదాతలు ఎందుకు అప్పులపాలైతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టు పక్కల భూముల్ని కబ్జా చేసేందుకే ధరణి తీసుకొచ్చారని విమర్శించారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదన్నారు. రాష్ట్రంలో అమలౌవుతున్న ప్రతీ స్కీంలో కేంద్రం పైసలు ఉన్నాయన్నారు.
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సమయంలో వచ్చి..ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోతరని బండి సంజయ్ అన్నారు.. కేసీఆర్.. అయితే పెళ్లి కోరుతరు..లేకపోతే చావు కోరతారన్నారు. మోడీ ఛాయ్ అమ్మిన వ్యక్తని..ఆయన పేదోళ్ల గురించి ఆలోచిస్తారన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. స్కూళ్లల్లో విద్యార్థులుంటే..టీచర్లు లేరు..టీచర్లు ఉంటే..విద్యార్థులు లేరని విమర్శించారు.