కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల

బీజేపీ స్టేట్  చీఫ్​, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఫార్మాలిటిస్ పూర్తయ్యాక బండి సంజయ్ ను అధికారులు విడుదల చేశారు. జైలు వద్దకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు రావడంతో జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. టెన్త్​ హిందీ క్వశ్చన్ పేపర్ లీక్  కేసులో సంజయ్ కు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్.. ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు ఉంచారు.  మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి  బర్తరఫ్ చేయాలన్నారు. TSPSC, టెన్త్ పేపర్ లీకేజీలపై సిట్టింగ్​ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబమే లీకుల, లీక్కర్ వీరుల కుటుంబమని సంజయ్ ఆరోపించారు. అటు వరంగల్ డీజీపీపై సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీపీ రంగనాథ్ చెప్పినవన్నీ నిజాలేనా అని ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే ఫోటో పక్కన పెట్టి మూడు సింహలపై ప్రమాణం చేయాలన్నారు. 

హిందీ పేపర్ తాను లీకేజీ చేశానని తనని అరెస్ట్ చేశారని మరి ముందురోజు తెలుగు పేపర్  ఎవరు లీక్  చేశారని సంజయ్ ప్రశ్నించారు. హిందీ పేపర్ ను ఎవరైనా లీక్  చేస్తారా సంజయ్ ప్రశ్నించారు. ఎగ్జామ్ పేపర్ ఎవరో షేర్ చేస్తే తనకు ఎంటీ సంబంధమన్నారు.  దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని, కేటీఆర్, కవిత జైలుకు పోవడం ఖాయమని సంజయ్ చెప్పారు.  తెలంగాణను అభివృద్ది చేయడానికి పీఎం మోడీ సిద్దంగా ఉన్నారని, నిధులు కూడా కేటాయిస్తున్నారని, కానీ కేసీఆర్ ఆ నిధులును దారి మళ్లిస్తుండని సంజయ్ ఆరోపించారు. ఏప్రిల్ 08న జరిగే మోడీ సభకు అందరూ రావాలని ప్రజలకు సూచించారు, 

https://www.youtube.com/watch?v=9GATDDX47pE

https://www.youtube.com/watch?v=-0vol6wAVtU