భారత్ ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు : బండి సంజయ్

వన్డే వరల్డ్‌ప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్‌లో  బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.  టవర్ సర్కిల్ వద్దకు భారీగా బీజేపీ  కార్యకర్తలు, క్రికెట్ అభిమానులు చేరుకున్నారు.  ఈ సంబరాల్లో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కూడా  పాల్గొన్నారు.  స్వయంగా బాణాసంచా పేల్చారాయన.  భారత్ మాతా కీ జై అంటూ జాతీయ పతాకాలతో నినాదాలు చేశారు.   

గుజరాత్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయం సాధించిన టీంకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు బండి సంజయ్ .  దేశభక్తులు ఈ మ్యాచ్ కోసం 6 నెలలుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.  కేంద్ర మంత్రి అమిత్ షా మ్యాచ్ చూస్తున్నప్పుడు మ్యాచ్ గెలవడం చాలా అనందంగా తెలిపారు.  భారత్  ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని సంజయ్ చెప్పు్కొచ్చారు.  

ఈ మ్యాచ్ లో పాక్ నిర్ధేశించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 20 ఓవర్లు మిగిలివుండగానే భారత్  చేధించింది. మొదట భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు తేలిపోగా.. లక్ష్య ఛేదనలో భారత ఆటగాళ్లు  వీరవిహారం చేశారు. రోహిత్ (86), శ్రేయాస్ అయ్యర్(53) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది రెండు వికెట్లు తీసుకోగా... హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్(6 పాయింట్లు, +1.821  రన్‌రేట్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.