వరంగల్ – కరీంనగర్ హైవే పనులపై బండి సంజయ్ సమీక్ష

వరంగల్ – కరీంనగర్ హైవే నిర్మాణ పనులు ప్రారంభించడానికి కావలసిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో త్వరలో పనులు  ప్రారంభమవుతాయన్నారు. నిర్మాణ పనులపై హైవే అథారిటీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. హైవేను త్వరితగతిన పూర్తి  చేయాలనే లక్ష్యంతో  పనిచేస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. 

రహదారి  నిర్మాణాన్ని కావలసిన అనుమతులు, నిధుల మంజూరు కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి తనవంతు కృషి చేసినట్లు సంజయ్ తెలిపారు. దీన్ని నిర్మాణానికి కేంద్రం 2146.86 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.