- నేడు అన్ని మండల కేంద్రాల్లో వినతిపత్రాల అందజేత
కరీంనగర్, వెలుగు: రైతు సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం రైతు దీక్ష చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. సాగునీరు ఇవ్వకపోవడం, పంటల బీమా పథకం అమలు చేయకపోవడంపై నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీక్షకు ముందు సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు.
ఊటూర్ బ్రహోత్సవాల్లో బండి సంజయ్ పూజలు
మానకొండూర్, వెలుగు: మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామంలోని మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు నక్క మల్లేశం, బీజేపీ మండల అధ్యక్షుడు రాపాక ప్రవీణ్, లీడర్లు రాజిరెడ్డి, ఆంజనేయులు, పురుషోత్తం రెడ్డి, రమేశ్, రవీందర్, శ్రీనివాస్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.