మూసీ పునరుజ్జీవం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడి కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణం అన్ని అన్నారు. మూసీపై సీఎం రేవంత్ కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ బండి మాట్లాడుతూ 'ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ డ్రామాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. మూసీపై సీఎం పూటకోమాట మాట్లాడుతున్నారు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేం కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి... పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం' అంటూ హెచ్చరించారు.
ALSO READ | అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మంత్రి సీతక్క