కొడిమ్యాల, వెలుగు: 20 మంది కాంగ్రెస్ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రాముని పేరు వింటేనే వణుకు పుడుతోందన్నారు. కరీంనగర్‌ను అభివృద్ధి చేసినా కూడా కొంతమంది అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నికలప్పుడు మాత్రమే ఓటర్ల వద్దకు వస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశానని, అందుకు తనపై 100కు పైగా కేసులు పెట్టారన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శోభ పాల్గొన్నారు.