సీఎం కేసీఆర్ ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. 317 జీవో రద్దు చేయాలంటూ వరంగల్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కడుపున పెట్టుకోవాల్సిన ఉద్యోగులను కన్నీళ్లు పెట్టిస్తుడన్నారు.. ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని వదలబోమన్నారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో ఏవిధంగా పనిచేస్తారన్నారు. కేసీఆర్ మానవ మృగంలా వ్యవహరిస్తున్నారన్నారు. బదిలీలపై ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరన్నారు. సీనియర్లు,జూనియర్లంటూ కొట్లాట పెట్టారన్నారు.
ఉద్యోగుల తరపున బీజేపీ పోరాడుతుందని..ఎవరూ భయపడొద్దన్నారు. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే 317జీవోను చెత్తబుట్టలో వేస్తామన్నారు. బీజేపీ పోరాటానికి కేసీఆర్ భయపడుతున్నారన్నారు. కేసీఆర్ కు రాష్ట్రంలో ఎవరూ మద్దతివ్వడం లేదన్నారు. అందుకే మొన్నటి వరకు వామపక్షాలను తిట్టిన కేసీఆర్ వారిని పిలిచి ప్రగతి భవన్లో దావత్ ఇచ్చాడన్నారు. కేసీఆర్ చైనాకు సపోర్ట్ చేస్తున్నాడని..అందుకే కమ్యూనిస్టులతో కుమ్మక్కయ్యాడన్నారు.రాష్ట్రంలో ఇప్పటికీ 13 జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు రాలేదన్నారు. ప్రధాని మోడీ ఫోన్ చేసి బీజేపీ పోరాటాన్ని మెచ్చుకున్నారన్నారు. కోవిడ్ నిబంధనలు సడలించాక 317 జీవోకు వ్యతిరేకంగా త్వరలో లక్షలాది మందితో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.