హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు.హిందూ ధర్మం కోసం మాట్లాడడం మతతత్వమైతే.. బరాబర్ మాట్లాడుతానని అన్నారు. జగిత్యాల కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో బండి సంజయ్ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గల్ల ఎత్తుకుని తిరగాలంటే హిందు ధర్మం కోసం నిరంతరం పనిచేసిన శివాజీ మహారాజ్ విగ్రహాలను ఊరూరా ఏర్పాటు చేయాలని చెప్పారు. హిందుత్వం గురించి మాట్లాడిన వారిని మతతత్వ వాది అంటారంటే.. తాను మతతత్వ వాది అనే బోర్డును మెడలో వేసుకుని తిరుగుతానని తెలిపారు. హిందూ ధర్మానికి ఆపదొస్తే స్పందించేవాడే నిజమైన హిందువని బండి సంజయ్ అన్నారు.
అయ్యప్ప, సరస్వతి అమ్మవార్లను తిట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. ఇంకా మౌనంగా ఉంటే... బొట్టు పెట్టుకుని కన్పించినా రోడ్డుపై ఉరికించి కొడ్తరని అన్నారు. చచ్చేంత వరకు హిందువుగానే బతకాలి తప్ప మతాన్ని కించపర్చేలా వ్యవహరించొద్దన్నారు. హిందూ దేవుళ్ళను కించపరిస్తే ఊరుకోవద్దని సూచించారు.