కరీంనగర్ లో భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందన్నారు ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్. తన గెలుపులో బీజేపీ కార్యకర్తలే అసలైన హీరోలు అని చెప్పారు. నెలరోజుల పాటు బీజేపీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలు చాలాసార్లు తలకిందులయ్యాయని చెప్పారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే జరిగిందన్నారు.
రాష్ట్రంలో ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సర్వేలపై తమకు నమ్మకం లేదని చెప్పారు. ఎవరికి వారే ముఖ్యమంత్రి కావాలని చెప్పుకోవడంలో తప్పులేదన్నారు. చివరికి కేఏ పాల్ కూడా సీఎం అంటున్నారని సెటైర్ వేశారు.