నేనెక్కడికి వెళ్తే అక్కడ కరెంట్ కట్ చేస్తున్నరు: బండి సంజయ్

తాను ఎక్కడికెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నారని.. మరో 15 రోజుల్లో కేసీఆర్ పవర్ కట్  కాబోతుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లోని భగత్ నగర్, రామచంద్రాపూర్, బొమ్మకల్ , అంజనాద్రి కాలనీల్లో ప్రచారం చేశారు సంజయ్. తనను అసెంబ్లీకి రానివ్వకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

తాను  పేదల కోసం కొట్లాడుతున్నానని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు బండి సంజయ్. తాను ఎంపీగా కేంద్రం నిధులు తీసుకొస్తే  కొబ్బరికాయలు కొట్టి ఫోజులు కొడుతున్న గంగులకు గుణపాఠం చెప్పాలన్నారు.  కేంద్రం మంజూరు చేసిన  రెండు లక్షలకు పైగా  ఇండ్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్,  కాంగ్రెస్ నేతలది భూ కబ్జాలు, అవినీతి లొల్లి అన్నారు బండి సంజయ్. ఇంటి ముందు ఇసుక కుప్పలు కనిపిస్తే బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఖాళీ జాగాలు కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న  గంగుల... కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యువతక ఉద్యోగాల కోసం తాను కేసీఆర్ పై కొట్లాడి.. జైలుకు పోయానని చెప్పారు.