ఓటమి భయంతోనే రేవంత్ ప్రచారానికి వస్తున్నరు : బండి సంజయ్

ఓటమి భయంతోనే రేవంత్ ప్రచారానికి వస్తున్నరు : బండి సంజయ్

ఓటమి భయంతో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ లో  ప్రచారానికి  వస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ పార్టీ నేతల మాయ మాటలు విని మోసపోవదన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో   కొమ్ముకాస్తున్న వారికి కాకుండా ప్రశ్నిస్తున్న వారికి ఓటు వేయాలని సూచించారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల కోసం ఏనాడైనా ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు.

Also Read :  ఒకే హాల్ టిక్కెట్ నెంబర్ ఇద్దరికీ ఉందని.. గురుకుల ఎగ్జామ్ రాయనివ్వలే !

 ప్రజల కోసం ఉద్యమాలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నామన్నారు బండి సంజయ్.  అయినా బీజేపీకి ప్రజలు ఓట్లు వేయలేదు గెలిపించలేదన్నారు. పేద ప్రజల సమస్యల కోసం ఎందుకు పని చేయాలని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు...అందుకే ఈ సారి ఓటు బీజేపీ బలపర్చిన  ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏమి వచ్చిందని ప్రశ్నించారు. రేషన్ కార్డు ఇచ్చారా.?  ఇల్లు ఇచ్చారా.. ఎందుకు కాంగ్రెస్ ఓటు వేయాలన్నారు బండి సంజయ్