ప్రశ్నించే గొంతుకను.. కాపాడుకుంటారా ? పిసికేస్తారా ? : బండి సంజయ్

ప్రశ్నించే గొంతుకను తాను అని, కాపాడుకుంటారా..? పిసికేస్తారా..? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. తనను ఎన్నికల్లో గెలిపించే అంతిమ నిర్ణయం ప్రజలదే అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను యుద్ధం చేస్తున్నానని చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు బీజేపీ నేతలు. 

అణిచి వేసేందుకు తనపై 74 కేసులు పెట్టినా ఏనాడు భయపడలేదన్నారు బండి సంజయ్. ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు ఇచ్చి తనను, పార్టీ అభ్యర్థులను గెలపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.