
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ పార్ల మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన తొమ్మి దేండ్లలో రూ.12 వేల కోట్లు ఇచ్చిందని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. తొమ్మిదేండ్లలో తన నియోజకవర్గంలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్, ఆ సెగ్మెంట్లోని గ్రామాల కు ఇచ్చిన నిధుల వివరాలను పథకాల వారీగా ట్విట్టర్లో ఆయన వివరించారు. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ. 575.9 కోట్లు, కోనరావుపేట మండలానికి రూ.150.8 కోట్లు ఇచ్చి ఆ ప్రాంతాల అభి వృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని ఆయన చెప్పారు. వేములవాడ నియోజ కవర్గంలోని గ్రామాలకు ఏడు సంక్షేమ పథకాల ద్వారా అందించిన నిధుల వివరాలను కూడా ఆయన పేర్కొన్నారు.