
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్ వేశారు. ముఖ్యమంత్రికి పాలన మీద పట్టులేకుండా పోయిందని.. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి? అని ప్రశ్నించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పు రస్కరించుకుని కరీంనగర్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రివర్గంలో ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరం.
రాష్ట్రాన్ని దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడు తున్నారు. హెచ్ సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణం. కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చే యాల్సిన సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయి. సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.10లే. ఆ విషయాన్ని తెలుసుకుని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడితే మంచిది' అని బండి సంజయ్ సూచించారు.