
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొదటి ద్రోహి కేసీఆరే అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.దక్షిణ తెలంగాణ ఏడారి కావడానికి మొదటి కారణం కాంగ్రె్ అయితే రెండో కారణం బీఆర్ఎస్ అని విమర్శించారు. చేపల పులుసు, బిర్యానీలు తిని తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.
వాస్తవానికి తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా..కేసీఆర్ 299 టీఎంసీ లకే ఓకే చెప్పారని, ఈ విషయాన్ని తాను ఆధా రాలతో సహా బయటపెట్టానని అన్నారు. దీనిపై ఇప్పటి వరకు కేసీఆర్ సమాధానం చెప్పలేదని అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రారంభం కాకపోవడాని కి కారకులెవరని బండి సంజయ్ ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో మొదట గళమెత్తిందే బీజేపీ అని, అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించినా కేసీఆర్ అబద్ధాలు చెప్పా రని అన్నారు.
నల్లగొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాలకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు కండ్లు మూసుకొని కూర్చున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడే ట్లు కరువయ్యారని, ఇక పార్టీ ఎక్కడుంటుందని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎ స్ చీకటి మిత్రులని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కాంప్ర మైజ్ అయ్యారనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేందుకే అభ్య ర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.