కేసీఆర్‎కు వరి కంటే లిక్కర్ మీద ప్రేమ ఎక్కువ

కేసీఆర్‎కు వరి కంటే లిక్కర్ మీద ప్రేమ ఎక్కువ
  • తెలంగాణలో వరి బంద్ పథకం అమలవుతోంది
  • అన్నీ కేంద్రమే చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?

కేసీఆర్‎కు వరి కంటే లిక్కర్ మీద ప్రేమ ఎక్కువని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధాన్యం కొనొద్దని కేంద్రం రాసిన లేఖను సాయంత్రం 5 గంటల లోపు బహిర్గతం చేయకుంటే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డెడ్‎లైన్ విధించారు. రైతుల పాలిట సీఎం కేసీఆర్ రాబందుగా మారాడని ఆయన అన్నారు.  వరిపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు కూర్చున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు.

‘ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా సీఎం లేఖ రాస్తే.. కేంద్రాన్ని మేం ఒప్పిస్తాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరతాం. కోర్టులను దిక్కరించే వ్యాఖ్యలు చేసిన కలెక్టర్‎పై న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేస్తాం. తెలంగాణలో పండిన ప్రతి పంటను  కేంద్రమే కొనుగోలు చేస్తోంది. అన్నీ కేంద్రమే చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? పండించిన ప్రతి పంట తామే కొంటామన్న కేసీఆర్.. నోరు విప్పాలి. వరి మీద కంటే కేసీఆర్‎కు లిక్కర్ మీద ప్రేమ ఎక్కువ. తెలంగాణలో వరి బంద్ పథకం అమలవుతోంది. వరి కాకుండా ఏ పంట పండించాలో ప్రభుత్వం దగ్గర ప్రణాళిక కూడా లేదు. వరి పంట వేయకుంటే లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజక్ట్ ఎందుకు? రైతుబంధు ఇచ్చి.. సీఎం కేసీఆర్ అన్నీ బంద్ చేస్తున్నాడు’ అని బండి‌ సంజయ్ అన్నారు.

For More News..

హుజురాబాద్ ఎన్నికలు రద్దు చేయాలి: కాంగ్రెస్

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ