తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ గెలవొద్దనే ఉద్దేశ్యం తోనే కేసీఆర్ ఇలా చేస్తు్న్నారని చెప్పారు.
30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతినెల పాకెట్ మనీ ఇస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ లోకి వస్తారన్న విషయం కేసీఆర్ కూడా తెలుసునని అందుకే వారిని పెంచి పోషిస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు.
రాష్ట్రంలో జరిగిన అన్ని ఉపఎన్నికల్లో కూడా బీజేపీనే గెలిచిందని, కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాలేదని బండి సంజయ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయని ఆ పార్టీ అగ్రనేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి నేతలు చెబుతున్నారని అన్నారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, బీజేపీనే అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రత్యామ్నయం బీజేపినే అని చెప్పుకొచ్చారు.