పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. పొత్తులపై బీజేపీ చెప్పిందే నిజమవుతుందన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వరంగల్ లో రాహుల్ గాంధీ చెప్పారని.. కాని అధిష్టానం నిబంధనలను ధిక్కరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి ప్రశ్నించారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ హైకమాండ్ మాట వినడం లేదని బండి సంజయ్ ఆరోపించారు.
బీజేపీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో అన్న భయంతోనే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని.. ప్రజలకు అర్థం కాకుండా నటిస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేయడం కోసం కేసీఆర్ ఎన్నికల సమయం దగ్గర పడే వరకు కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నారని ఆయన విమర్శించారు.