లక్ష్మణచాంద(మామడ), వెలుగు: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని అంబేద్కర్‌సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ డిమాండ్‌చేశారు. అంబేద్కర్ యువజన సంఘం, మాల మహానాడు ఆధ్వర్యంలో బుధవారం మామడ మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజానీకానికి బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, గద్దర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గుజరాతీల చెప్పులు మోసే నీకు గద్దర్ విలువ తెలియదని ఫైర్ అయ్యారు. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సుధాకర్ కు వినతిపత్రం అందజేశారు. మాల మహానాడు గౌరవ అధ్యక్షుడు సంపేర్ల రత్నయ్య, మండల అధ్యక్షుడు దేవోళ్ల మధు, ప్రధాన కార్యదర్శి కప్పకంటి సురేశ్, సెక్రటరీ కాల్వ అశోక్, సాయన్న, ఉపాధ్యక్షులు రాజేందర్, జాకీర్, భూమన్న, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.