వాటిమీద కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు చూస్తే.. వాళ్లకు బాత్రూమ్ కూడా వస్తలేదు

వాటిమీద కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు చూస్తే.. వాళ్లకు బాత్రూమ్ కూడా వస్తలేదు

టీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు వస్తనే కనబడతారన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. వరద బాధితులను పరామర్శించేందుకు  మోడీ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. హైదరబాద్ లో ఉన్న మీ నాన్న కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కవాడిగూడలో రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వమే సహాయం చేసిందన్నారు. వరదలు వస్తే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదన్నారు. కవాడి గూడలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు. టీఆర్ఎస్  డబ్బులు ఇస్తే తీసుకుని బీజేపీకి కే ఓటు వేయాలన్నారు.

బాత్ రూమ్ ల దగ్గర కేటీఆర్, కేసీఆర్ ఫోటో లు పెట్టుకుంటే బాత్ రూమ్ పోయే వాళ్ళకు బాత్ రూమ్ వస్తది లేదన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారన్నారు.  కార్పొరేట్ ఆసుపత్రులతో కుమ్మక్కయ్యారు కాబట్టే కేసీఆర్ భారత్ బయో టెక్ కు వెళ్ళకుండా కరోనా వాక్సిన్ ను అడ్డుకునే కుట్ర చేస్తున్నాడన్నారు. కూత వేటు దూరంలో ఉన్నభారత్ బయో టెక్ కు ఇన్ని రోజులు సీఎం ఎందుకు పోలేదన్నారు. కరోనాకు వాక్సిన్ ను తీసుకొద్దామని పీఎం ప్రధాని ప్రయత్నం చేస్తుంటే దాని పైన కూడా సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడన్నారు.