పైరవీలు పనిచేయవు.. పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ . కరీంనగర్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ దశగ్రహ యాగాలు చేయాలన్నారు. కేసీఆరే దశమ గ్రహం .. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం యాగాలు చేయాలన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి, బిడ్డ కోసం యాగాలు చేస్తున్నాడని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ప్రజలు నోఎంట్రీ బోర్డు పెట్టారని విమర్శించారు.
కరీంనగర్ పార్లమెంటులోనే బిజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు కావాలన్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు వచ్చాయని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువగా సభ్యత్వం చేయాలన్నారు.
Also Read:-4 వారాల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి
కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చడానికే హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పై ప్రజల్లో విరక్తి స్టార్ట్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రాతో డైవర్ట్ చేస్తుందన్నారు. హైడ్రాతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మొదట హైడ్రాకి సపోర్ట్ చేశా.. కానీ హైడ్రాపై విశ్వాసం పోతుందన్నారు. పేదల ఇళ్లను కూలుస్తున్నారని విమర్శించారు.