వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తయ్ : బండి సంజయ్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తయ్ : బండి సంజయ్

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. సింగిల్ గానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు  కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయని ఆరోపించారు.  

ములుగు జిల్లా పోలింగ్ బూత్ సమ్మేళన సభలో బండి సంజయ్ పాల్గొన్నారు.  తెలంగాణ రాకముందు మాములు ఇంట్లో ఉన్న కేసీఆర్ కు ఇన్ని కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో  చెప్పాలని డిమాండ్ చేశారు.  రెండు సార్లు కేసీఆర్ కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 5 లక్షల ఆప్పుల్లోకి తీసుకువచ్చాడని, మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రం మరింతం అప్పుల్లోకి వెళ్తుందన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారని కానీ అందుకు కేసీఆర్ సహాకరించడం లేదని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్న సంజయ్..  రుణమాఫీ, నిరుద్యోగ భృతి వెంటనే క్లియర్ చేయాలన్నారు. గిరిజనుల అభివృద్ధి్ కోసం ఎన్నికోట్లు ఖర్చు చేశారో  శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.