మంత్రి కేటీఆర్కు బండి స్ట్రాంగ్ కౌంటర్

కరీంనగర్: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ‘‘బండికి తుప్పు పట్టిందని’’ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘తుప్పు పట్టింది బండి కాదు.. నీ కారుకే తుప్పు పట్టిందని’’ బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్లో ఒక్కరు ఉండరని అన్నారు. 

మంత్రి కేటీఆర్కు  అంత అహంకారం పనికిరాదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా.. నీ భాషను చూసి నీ ఎమ్మెల్యేలే  ‘‘ఛీ’’ అంటున్నారని విమర్శించారు. రాజాసింగ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి స్పందిస్తూ.. ‘‘రాజాసింగ్ దమ్మున్న లీడర్.. నీకు దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చెయ్యి’’ అని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. 

ALSO READ: మోదీ గొప్ప ప్రధాని.. ప్రజలకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు : వివేక్ వెంకటస్వామి