పాదయాత్రలో రాఖీ పండుగ జరుపుకున్న బండి సంజయ్

యాదాద్రి : ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 10వ రోజు రామన్న పేట మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మండలంలోని పల్లివాడలో పేదల గుడిసెల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. బండి సంజయ్ తమ ఇంటికి రావడంతో మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

కేసీఆర్ పాలనలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి మహిళలు బండి సంజయ్ కు మొరపెట్టుకున్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇండ్లు కట్టిచ్చి ఇస్తామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. అనంతరం పల్లీవాడలో బీజేపీ జెండా ఆవిష్కరించారు.