కేసీఆర్ నిన్ను వదలం..శివుడు, మోడీ చూస్కుంటరు: బండి సంజయ్

సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వేములవాడలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని కేసీఆర్  ను ఆ శివుడు, మోడీ తప్పకుండా చూస్తారని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని బండి సంజయ్ దర్శించుకున్నారు. రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తున్నా.. ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. యాదాద్రిని అభివృద్ధి చేసిన కేసీఆర్ వేములవాడను మర్చిపోయారు కానీ.. వేములవాడకు వచ్చిన భక్తులు ఆ శివుడిని, కేసీఆర్ ను మర్చిపోరని అన్నారు.   

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత పేరు నాలుగు సార్లు  వచ్చినా కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.  వేములవాడకు  10 కోట్లు అడిగినా ఇవ్వడం లేదు.. మరి నీ బిడ్డకు రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.