కేటీఆర్ కండకావరమెక్కి మాట్లాడుతున్నాడు: బండి సంజయ్

జగిత్యాల: మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు బీజేపీ నేత బండి సంజయ్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఆదివారం (మార్చి10) బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ కండకావరమెక్కి మాట్లాడుతున్నాడు..పార్లమెంట్ రికార్డులు చూసుకో..నేను సమావేశాలకు వెళ్లానో లేదో తెలుస్తుందన్నారు. చీపురుతో బీఆర్ ఎస్ ను ఊడ్చేసినా సిగ్గే లేకుండా కదనభేరి నిర్వహిస్తున్నారని విమర్శించారు. కొండగట్టు,వేములవాడ, ధర్మపురి ఆలయాలకు బీఆర్ ఎస్ ప్రభుత్వం హామీలిచ్చి నెరవేర్చలేదని బండిసంజయ్ అన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తేనే పంచాయతీలకు నిధులోస్తాయన్నారు బండి సంజయ్. 

ALSO READ :- నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. సిద్ధం సభలో జగన్

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరుగ్యారంటీల అమలుకు మరో నాలుగు రోజులే ఉంది..ఎల్లుండి ( మార్చి 12) కేబినెట్ భేటీలో వాటికి ఆమోదం నిధులు విడుదల చేయాలని బీజేపీనేత బండి సంజయ్ అన్నారు.