కరీంనగర్ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని జులై 15న దర్శించుకున్నారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆయన్ని చూడటానికి తండోపతండాలుగా తరలివచ్చారు.
ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల బోనాల జాతరకు ఈ ఏడాది ఆలస్యంగా దర్శించుకున్నట్లు చెప్పారు. ఇవాళే అమ్మవారి దర్శన భాగ్యం కలిగిందన్నారు.
ALSO READ :అధికార పార్టీ నేతల కోసం.. కొండగట్టు అంజన్న దర్శనాలు నిలిపివేత
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం రాంగోపాల్‌పేట బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ కార్యాలయానికి వెళ్లిన బండి కార్యకర్తలతో ముచ్చటించారు.