మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరు : బండి సంజయ్ 

మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరు : బండి సంజయ్ 
  • ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తున్నది: బండి సంజయ్ 

హైదరాబాద్, వెలుగు: బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలెవరూ బయట తిరగలేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తోందని విమ ర్శించారు. బీజేపీ కార్యాలయంపై దాడిలో గాయపడ్డ నందురాజ్ కుటుంబాన్ని బండి సంజయ్ బుధవారం బహదూర్ పురాకు వెళ్లి పరామర్శించారు. నందురాజ్ ఆరోగ్య పరిస్థి తిపై ఆరాతీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్  నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారని సంజయ్  ఫైర్ అయ్యారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇనుప రాడ్లు, రాళ్లు, గుడ్లు, కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గు చేటని మండిపడ్డారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ నందురాజ్ ను పరామర్శించారు.