మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు అవసరం : బండి సంజయ్

మానసిక, శారీరక ఆరోగ్యానికి ఆటలు ఎంతో అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చెప్పారు. వివేకానంద జయంతి సందర్భంగా కరీంనగర్ గిద్దె పెరుమాళ్ళ ఆలయ క్రీడా మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు ముగిశాయి. యువకుల కోసం పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. చివరి రోజు కావడంతో ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు చెప్పారు. కొద్దిసేపు వారితో కలిసి బండి సంజయ్ క్రికెట్ ఆడారు.