మునుగోడు ఉప ఎన్నికపై ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్న బండి సంజయ్

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ పెద్దలకు రిపోర్టు అందజేయనున్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లనున్నారు. అనంతరం వారణాసిలో ఆయన పూజలు నిర్వహించనున్నారు. అక్కడ్నుంచి బండి సంజయ్ కర్ణాటకకు బయల్దేరనున్నారు. ఆ తర్వాత కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమ బలాబలాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించగా... ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా లీడర్లు కృషి చేస్తున్నారు.