హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..

 హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..

హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఘటన జరిగింది. పీవీ నరసింహారావు స్వగ్రామంలో పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్తుండగా కాన్వాయ్ పై కోడిగుడ్లు పడటం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. పీవీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ 
  
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానిగా పనిచేసిన ఏకైక నాయకుడు పీవీ నర్సింహారావు అని బండి సంజయ్ అన్నారున.  తెలంగాణ ఠీవిగా, పీవీ బహుభాషా కోవిదుడు, కవిగా, రచయితగా, జర్నలిస్టుగా పనిచేశారని తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించి దేశానికి ఎనలేని సేవలను చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తికి భారత రత్న ప్రకటించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు. 

 పీవీలాంటి గొప్ప వ్యక్తి చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్య క్రియలు జరపకుండా పీవీ ఆత్మను, ఆయన కుటుంబ సభ్యులను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. పీవీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానించిందో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం కూడా వ్యక్తం చేయని విమర్శించారు.