
బండి సంజయ్ మానసిక పరిస్థితి బాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అధ్యక్ష పదవికి పోటీ నెలకొందని, పోటీలో భాగంగా ఆకర్శించేందుకే కేసీఆర్ పైస అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆధారాలు లేకుండా తీవ్ర ఆరోపణలు చేశారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం ఆ పదవిని కించపరిచేలా ఉన్నాయని అన్నారు.
బండి సంజయ్ కి దమ్ముంటే హైదరాబాద్ కు ఒక నేషనల్ పార్క్ తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు నిధులు తీసుకొచ్చే దమ్ము; ధైర్యం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలతో రాజకీయాలు చేయాలని బండి సంజయ్ చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రధాని మోడీ ఇలాంటి నాయకులను బర్తరఫ్ చేయాలని కోరారు.
ALSO READ | తెలంగాణలో అతిపెద్ద స్కామ్ మిషన్ భగీరథ స్కీమ్: ఎమ్మెల్యే వివేక్
బండి సంజయ్ వ్యాఖ్యలు దేశానికి సిగ్గుచేటని మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. కరీంనగర్ కు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ప్రయత్నించాలి తప్ప ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో తన పదవిని కించపరుచుకోవద్దని హితవు పలికారు.