బట్టలు చింపేశారు.. తింటుంటే లాక్కెళ్లారు : బండి  భగీరథ

తమ తండ్రిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమారుడు భగీరథ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి వారెంట్ చూపించకుండానే ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

బండి భగీరథ ఏమన్నారంటే..? 

‘‘నాన్న (బండి సంజయ్ ) రాత్రి సమయంలో భోజనం చేస్తున్నారు. ఆ టైమ్ లో పోలీసులు ఇంటికి వచ్చారు. ఏసీపీ వచ్చారని చెప్పడంతో కూర్చోమ్మని నాన్న చెప్పారు. ఇంతలోనే నాన్న వచ్చి పోలీసులతో మాట్లాడుతుంటే అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..వారెంట్ చూపించమని అడిగారు. అవేవీ లేవని పోలీసులు చెప్పారు. వెంటనే నాన్న సీపీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ.. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నాన్న ప్రశ్నించడంతో దాదాపు 50 మంది పోలీసులు వచ్చి.. బలవంతంగా నాన్నను తీసుకెళ్లారు. అడ్డొచ్చిన బీజేపీ కార్యకర్తలను, మమ్ముల్ని కూడా అడ్డుకున్నారు. కొంతమంది కార్యకర్తల దుస్తులను కూడా చించేశారు. ఇంటి బయట ఉన్న టెంట్ ను కూడా కింద పడేశారు. మా అమ్మమ్మ 10 రోజుల కర్మక్రియల సందర్భంగా నాన్న ఇంటికి వచ్చారు. కారణం చెప్పకుండానే ఇంటి నుంచి ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లారు’’ అని బండి భగీరథ చెప్పారు.

https://www.youtube.com/watch?v=viohQXGAKhI