ప్రజల కోసం తెగించి కొట్లాడే పార్టీ బీజేపీనే అన్నారు ఆ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్. అమరవీరుల రక్తపు మడుగులో కేసీఆర్ పాలన జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఖర్చు పెట్టే ప్రతీ పైసా కేంద్రానిదేనన్నారు. బీజేపీ ఏ మతాలకు వ్యతిరేకం కాదని..80 శాతం ఉన్న హిందువుల కోసం కొట్లాడుతున్నామన్నారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 2023లో తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తామన్నారు. తెలంగాణలో కారు బేజారయిందని.. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు.
ఆదిలాబాద్ లోని కాగజ్ నగర్ లో ఛత్రపతి శివాజీ సంకల్ప సభ నిర్వహించారు . ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..పోరాటాల పురిటిగడ్డ ఆదిలాబాద్ అని అన్నారు. కేసీఆర్ బట్టేబాజ్ సీఎం అని..ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ గడీలను బద్దలు కొడతామన్నారు. గోల్కోండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాక్షష పాలన అంతమొందించేందకు బీజేపీ పోరాడుతుందన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లుతో స్థానికులకు లాభం జరగలేదన్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రెండు బర్రెలతో వచ్చిన కోనప్ప రూ.200 కోట్లు సంపాదించాడన్నారు. కేసీఆర్ మానవత్వం లేని మానవ మృగమని అన్నారు. పాల్వాయి హరీష్ రాజకీయాల కోసం బీజేపీలోకి రాలేదన్నారు. పేద ప్రజల బాగు కోసం పాల్వాయి పురుషోత్తం పాటుబడ్డారన్నారు. పరుషోత్తం వారసుడిగా హరీష్ బీజేపీలో చేరుతున్నారన్నారు.
ప్రాణహిత ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్లకు పెంచారన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడిన మూర్ఖుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం నీళ్లన్నీ కేసీఆర్ ఫాంహౌజ్ కే వెళ్తున్నాయన్నారు. తమ్మిడి హట్టి బ్యారెజ్ దగ్గర తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. కమీషన్లు వస్తలేవు కాబట్టే తమ్మిడి హట్టి బ్యారెజ్ కట్టడం లేదన్నారు.