
మొగుళ్లపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అధికార పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బండి సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మొగుళ్లపల్లిలో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ క్యాడర్ పాత కొత్త తేడా లేకుండా సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్లాలని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.
కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ఖ్యాత రాజు రమేశ్, మండల జనరల్ సెక్రెటరీ నడిగోటి రాము, చిట్యాల ఏఎంసీ వైస్ చైర్మన్ రఫీ, మాజీ ఎంపీటీసీలు మంద స్వామి, ఎర్రబెల్లి పున్నం చందర్రావు తదితరులు
ఉన్నారు.