మానేరుపై హైలెవెల్ బ్రిడ్జికి నిధులు కేటాయించండి

మానేరుపై హైలెవెల్ బ్రిడ్జికి  నిధులు కేటాయించండి
  •      కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మానేరుపై హైలెవెల్ బ్రిడ్జికి నిధులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కేంద్ర ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైవేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశాల సందర్భంగా ఢిల్లీని మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కరీంనగర్  పార్లమెంటరీ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.224కోట్లు కేటాయించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి–పోతూరు రోడ్డు నుంచి బావుపేట ఖాజీపూర్ వరకు మానేరుపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. 

బ్రిడ్జితోపాటు మొత్తం 90 కి.మీల మేర డబుల్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలని ప్రతిపాదించారు. దీంతోపాటు వివిధ గ్రామాలు, మండలాలకు వెళ్లే రోడ్లను డబుల్​ లేన్​గా మార్చేందుకు నిధులు ఇవ్వాలని కోరారు. సంజయ్ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే సీఆర్ఐఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపైనా గడ్కరీ ఆరా తీశారు.