మాజీ సీఎం కేసీఅర్ కొడుకుగా తప్పా కేటీఆర్ కు ఎలాంటి గుర్తింపు లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్, కేసీఆర్ సపోర్ట్ తో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కానీ సీఎం రేవంత్ అలా కాదని ఆయన ఓ పోరాట యోధుడని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన చిత్ర హింసలను, మానసిక క్షోభను అధిగమించి సీఎం అయ్యారని తెలిపారు.
కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందన్నారు బండ్ల గణేష్ . రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. సీఎంను నేరుగా ఏమీ అనలేక వందల యూట్యూబ్ ఛానళ్లు పెట్టి తిట్టిస్తున్నారని గణేష్ ఆరోపించారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారని.. అలాంటిది కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ కు మూడు సీట్లు కూడా రాకపోయేవని విమర్శించారు. పొలిటికల్ లీడర్ గా కేటీఆర్ డిజాస్టర్ అని చెప్పారు.
అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికాకు వెళ్ళారని చెప్పారు బండ్ల గణేష్. కేటీఆర్ హాయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్ల ధనం దొరుకుతున్నాయన్నారు. ప్రజలకు తాము ఆరు గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ అనే ఏడో గ్యారెంటీ ఇచ్చామని చెప్పారు.
ALSO READ :- NAM vs NEP: 33 బంతుల్లో సెంచరీ.. నమీబియా బ్యాటర్ వరల్డ్ రికార్డ్
మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారని ప్రశ్నించారు బండ్ల గణేష్. మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా? అని నిలదీశారు. మేడిగడ్డ కూలిపోతే తమదే బాధ్యత అని బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా కాపడుతున్నామని చెప్పారు.