బండ్లన్న వాకిట్లో టపాసులు..ఏందీ సామీ అమ్మడానికా..కాల్చడానికా?

పవర్ స్టార్ వీరాభిమానిగా చెప్పుకునే ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)తనదైన పోస్ట్తో ఆసక్తి రేపారు. బండ్ల గణేష్  ఏం చేసిన స్పెషల్ ఉండేటట్లు చూస్తాడు. ఏది చేసినా కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగానే ఉంటుంది. బడా ప్రొడ్యూసర్ కాబట్టి..బాంబులను కూడా అదే రేంజులో కొనేశాడనిపిస్తోంది.

లేటెస్ట్గా దీపావళి సందర్బంగా..భారీగా కొనుగోలు చేసిన టపాసుల ఫొటోస్ను బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. 'వినాయక చవితి చేసుకోలేదు..దసరా కూడా చేసుకోలేదు..దీపావళి మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటున్నా' అని పోస్ట్ లో తెలిపారు. 

ఈ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్..భిన్నమైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. షాపులో కూడా ఇన్నేసి..టపాసులు ఉండవు కదా..' ఏంటీ బండ్లన్న..ఇవి పేల్చడానికా..లేక అమ్మడానికా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

బండ్ల గణేష్ ఈ ఒక్క దీపావళి అనే కాదు..ప్రతీ దీపావళికి టపాసులు కొంటాడు. వాటిని తన ఇంటి ముందున్న వాకిటిలో పేర్చి..వాటి ముందు నిల్చుని..అలా ఫోటో దిగి పోస్ట్ చేసేస్తాడు. మరి బండ్ల గణేష్ ఊరంతా సరిపోయే టపాసులను కొంటాడా? అని అందరికీ అనుమానం వచ్చేలా మాత్రం..ప్రతి దీపావళికి అట్ట్రాక్ట్ చేస్తాడు. గత మూడేళ్ళ నుంచి బండ్ల గణేష్ ఇలానే చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్ గా  ఈ ఏడాదికి సంబంధించిన ఫోటోస్ కూడా షేర్ చేయడంతో..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా..హ్యాపీ దీపావళి బండ్లన్న.