అన్నా.. వస్తున్నా.. బండ్లన్న పొలిటికల్ ట్వీట్ వైరల్

అన్నా.. వస్తున్నా.. బండ్లన్న పొలిటికల్ ట్వీట్ వైరల్

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ పాలిటికల్స్ పై మరోసారి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో లేనంటూనే.. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా కామెంట్స్‌ చేశారు బండ్ల గణేష్. దీంతో.. మరోసారి ఆయన పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నట్టు హిట్ ఇచ్చారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రలో పాల్గొననున్నట్లు బండ్ల గణేశ్‌ తెలిపారు. ఈమేరకు ట్వీట్ చేసిన బండ్ల గణేష్.. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు ప్రకటించారు.

"అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ పొలిటికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్… https://t.co/ZTmWiMcCaL

— BANDLA GANESH. (@ganeshbandla) June 25, 2023