
బండ్ల గణేష్ నిర్మాతగా,నటుడిగా ఎంత ఫేమస్సో.. సినిమా ఫంక్షన్లలో స్పీచ్ లకు, సోషల్ మీడియా మీమ్స్ కి కూడా అంతే ఫెమస్. బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. రాజకీయ అంశాలు, సామాజిక అంశాలపై తరచూ ఎక్స్ లో స్పందిస్తుంటారు బండ్ల గణేష్. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబును ఉద్దేశించే అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే అని.. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమేనని అన్నారు బండ్ల. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుందని... మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలని అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
Also Read:-తిరుపతి జిల్లాలో పుష్ప సీన్.. కాకపోతే అక్కడ ఎర్రచందనం.. ఇక్కడ ఆవులు
శుక్రవారం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అని.. పవన్ విజయానికి కృషి చేసింది ఒకటి పవన్ కళ్యాణ్, రెండ్ పిఠాపురం ఓటర్లు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. నాగబాబు వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ నేత వర్మ సీటు త్యాగం చేస్తేనే పవన్ కళ్యాణ్ గెలిచారని.. పవన్ విజయం వెనక వర్మ కృషి ఉందని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే,
— BANDLA GANESH. (@ganeshbandla) March 15, 2025
ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.”
ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి….!
ఎన్నికల ప్రచారంలో తమ నేతను వాడుకొని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కనీసం కృతజ్ఞత చూపకపోవడం సమంజసం కాదని వర్మ అనుచరులు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ ట్వీట్ కూడా ఎమ్మెల్సీ నాగబాబును ఉద్దేశించే అంటూ కామెంట్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.