నా రేవంతన్న, చంద్రన్న కలిసే ఉండాలె : బండ్ల గణేష్ ట్వీట్

నా రేవంతన్న,  చంద్రన్న కలిసే ఉండాలె : బండ్ల గణేష్ ట్వీట్

హైదరాబాద్​: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,  ఏపీ సీఎం చంద్రబాబుల బంధంపై ప్రముఖ నటుడు, కాంగ్రెస్​ లీడర్​ బండ్ల గణేష్ ట్విట్టర్​ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని గణేష్ ఆకాంక్షించారు. ‘పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ బంధం అనేది విడదీయరానిది. నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు‌కు ట్యాగ్ చేశారు.