మేడారం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్. కుటుంబ సమేతంగా వచ్చిన బండ్ల గణేష్ కు గిరిజన సాంప్రదాయం ప్రకారం జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. తర్వాత గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో మేడారం సందడిగా మారింది. సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఇతర దేశాలలో ఉన్న భక్తులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి..చల్లగా చూడు తల్లీ అంటూ మొక్కలు చెల్లించుకుంటున్నారు.