లంచం తీసుకుంటూ ఏసీబీకీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు. ఓ వ్యక్తిపై నమోదైన కేసును క్లోజ్ చేసేందుకు 30 వేలు లంచం డిమాండ్ చేశారు ఎస్సై పవన్, కానిస్టేబుళ్లు సంతోష్, రామకృష్ణ.
అయితే బాధితుడు ఏసీబీకి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎస్సై పవన్, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ కొనసాగిస్తున్నారు.